గురువుల‌ను మ‌రవొద్దు..!

కెరీర్ తాండూరు వికారాబాద్

గురువుల‌ను మ‌రవొద్దు..!
– రిటైర్డ్ టీచ‌ర్ల‌ను స‌న్మానించిన మార్వ‌డి యువ‌మంచ్
– ఘ‌నంగా ఉపాధ్యాయ దినోత్స‌వం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గురువుల‌ను మించిన దైవం లేద‌ని, గురువుల‌ను మ‌రొద్ద‌ని తాండూరు మార్వాడి యువ‌మంచ్ ప్ర‌తినిధులు అభివ‌ర్ణించారు. సోమ‌వారం రాత్రి తాండూరు మార్వ‌డి యువ‌మంచ్ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని బాలాజీ మందిరంలో ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మార్వాడి యువ‌మంచ్ స‌భ్యులు రాజ్‌గోపాల్ సార‌డా, రాష్ట్ర మాజీ అధ్య‌క్షులు ర‌మేష్ చంద్ర‌సార‌డా, జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు మ‌న్మోహ‌న్ సారడా, జాతీయ క‌న్విన‌ర్ కుంజ్ బిహారి సోనిలు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా డాక‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా మంచ్ ఆధ్వ‌ర్యంలో ప‌ద‌వి విర‌మ‌ణ పొందిన‌ యాలాల మండ‌లానికి చెందిన బి. శ్రీ‌నివాస్, పెద్దేముల్ మండ‌లానికి చెందిన కిషన్ రావు, ఆశిరెడ్డి, బ‌షీరాబాద్ మండ‌లానికి చెందిన బి.ఎల్ల‌ప్ప‌, స‌త్య‌శివ‌ప్ప‌, తాండూరు మండ‌లానికి చెందిన ప్ర‌కాష్, జ‌గ‌న్నాథ్ రెడ్డిలను ఘ‌నంగా స‌న్మానించారు. అదేవిధంగా స‌మాజంకు చెందిన ప‌దోతర‌గ‌తి, ఇంట‌ర్ లో 85శాతం ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల‌ను కూడ స‌త్క‌రించారు. అనంత‌రం ప‌లువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప‌విత్ర‌మైంద‌న్నారు. మంచి స‌మాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీల‌క‌ని పేర్కొన్నారు. మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులనేగాక మంచి సమాజాన్ని కూడా నిర్మించగలరన్నారు. మంచి ఉపాధ్యాయుణ్ణి ఏ విద్యార్థికూడా తన జీవిత కాలంలో మరిచిపోవ‌ద్ద‌న్నారు. గురువుల సేవ‌లో త‌రించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచ్ అధ్య‌క్షులు బ్రిజ్ మోహ‌న్ బూబ్, కార్య‌ద‌ర్శి కిష‌న్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార‌డా, స‌భ్యులు సంజ‌య్ సార‌డా, అనిల్ సార‌డా, మధుసూద‌న్ సోని త‌దిత‌రులు పాల్గొన్నారు.