టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయండి
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– టీఆర్ఎస్లో చేరిన యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో యువకుల పాత్ర కీలకమని, యువతే పార్టీకి బలమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు అనిల్ బాండ్ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్‌కు చెందిన 2వ వార్డు, 25వ వార్డులలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎజాజ్, రాము, సయ్యద్ అన్వర్, బాబా, అబ్దుల్ కరీం, మోసిన్ ఖాన్, శంషూ, కృష్ణ, అజ్మత్ ఖాన్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.


