అర్హులందరు ఫించన్‌ను సద్వినియోగం చేసుకోవాలి
– కార్డులను అందజేసిన కౌన్సిలర్ బోంబీనా
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా ఫించన్ పథకంను అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు మున్సిపల్ 14 వ వార్డు కౌన్సిలర్ బోంబీనా పేర్కొన్నారు. శనివారం తన వార్డులోని మాణిక్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్, మసీద్ ప్రాంతం, కర్బలా మైదాన్ తదితర ప్రాంతాలలో కొత్తగా ఫించన్ మంజూరైన లబ్దిదారులకు ఫించన్ మంజూరు పత్రాలు, కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు, వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ఫించన్ పథకం ధైర్యం ఇస్తుందన్నారు. పెంచన్ను దుర్వినియోగం చేయకుండా అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. వార్డు ప్రజలకు ఫించన్ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ వార్డు ఇంచార్జ్ అబ్దుల్ రవూఫ్, వార్డు పెద్దలు పాల్గొన్నారు.


