రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఆర్థిక సహాయం
డ రూ.51 వేలు అందజేసిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం వాల్మీకీ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం దేవాలయాన్ని దీపా నర్సింలు సందర్శించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా తనవంతు సాయం అందించేందుకు దీపా నర్సింలు ముందుకొచ్చారు. రూ. 51 వేల నగదును ఆలయ కమిటి సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం పట్ల ఆలయ కమిటి సభ్యులు దీపా నర్సింలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డలి రవీందర్, కౌన్సిలర్ మంకాల రాఘవే అందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, నాయకులు పూజారి పాండు, దర్శీది రవి, చంటి యాదవ్ తదితరులు ఉన్నారు.


