బీసీల విద్యకు సర్కారు ప్రాధాన్యం
– పేద విద్యార్థుల కోసమే స్టడీ సెంటర్
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యకు సర్కారు ప్రాధాన్యమిస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం మంజూరు చేసిన స్టడీ సెంటర్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే గురుకులాలు, కళాశాలలు ఏర్పాటయ్యాయని తెలిపారు.అదేవిధంగా పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికే లక్ష్య ఉద్యోగాలకు నోటీఫికేషన్ వేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్టడీ సెంటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు భీంరాజు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, సెంటర్ ప్రతినిధి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


