మున్సిపల్ జవాన్ కన్నుమూత

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ జవాన్ కన్నుమూత
– గుండెపోటుతో మృతి చెందిన శ్రీను
– విచారం వ్యక్తం చేసిన అధికారులు, కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గుండెపోటుతో మున్సిపల్ జవాన్‌ మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్‌లో చోటు చేసుకుంది. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఎం. శ్రీను(30-34) గత కొన్నేళ్లుగా తాండూరు మున్సిపల్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గురువారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాండూరులోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యలోనే శ్రీను తుదిశ్వాస విడిచాడు. ఈ మరణ వార్త విన్న మున్సిపల్ అధికారులు, తోటి కార్మికులు విచారం వ్యక్తం చేశారు. శ్రీను మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాధం నెలకొంది. మున్సిపల్ జవాన్‌గా పనిచేసిన శ్రీను కరోనా సమయంలో విస్తృత సేవలు అందించి అధికారులు, ప్రజా ప్రతినిధుల మనన్నలు పొందారు. శ్రీనుకు భార్య బాలామణి, కుమారుడు, కూతురు ఉన్నారు.

ఇది కూడా చదవండి…
పట్టణ రహదారులకు రాజయోగం
– తాండూరు రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు
– జీఓ 217ను జారీ చేసిన ఆర్అండ్‌బీ
– ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి
https://dharshininews.com/17221
chaithany collage