ఏబీవీపీ వికారాబాద్‌ జిల్లా క‌న్విన‌ర్‌గా ఉప్ప‌ల రాజేష్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఏబీవీపీ వికారాబాద్‌ జిల్లా క‌న్విన‌ర్‌గా ఉప్ప‌ల రాజేష్
– రాష్ట్ర అధ్య‌క్షులు డా.శంక‌ర్ చేతుల మీదుగా నియామ‌కం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) వికారాబాద్ జిల్లా క‌న్విన‌ర్‌గా తాండూరుకు చెందిన ఉప్ప‌ల రాజేష్ నియామ‌కం అయ్యారు. ఈ నెల 19, 20వ తేదీల‌లో మేడ్చల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డా. శంకర్ అనంతగిరి జిల్లా (వికారాబాద్) నూతన కన్వీనర్ గా ఉప్పల రాజేష్ ను నియమిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల రాజేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా కన్వీనర్ గా బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర శాఖకు, పాలమూరు శాఖకు ధన్యవాదములు తెలిపారు రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికై శక్తి వంచన లేకుండా కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఉప్ప‌ల రాజేష్ గతంలో ఏబీవీపీ కళాశాల అధ్యక్షునిగా, రెండు సార్లు జిల్లా హాస్టల్స్ కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో- కన్వీనర్ గా పని చేశారు.