ఆద‌ర్శం.. ఆక‌ర్షితం.. టీఆర్ఎస్ సంక్షేమం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆద‌ర్శం.. ఆక‌ర్షితం.. టీఆర్ఎస్ సంక్షేమం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పార్టీలో భారీగా యువకుల చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ చేప‌డుతున్న సంక్షేమం ఆద‌ర్శంగా నిలవ‌డంతో.. ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై ఇత‌ర పార్టీల నుంచి గులాబీలో చేరిక‌లు పెరుగుతున్నాయ‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం వాల్మీకీ నగర్కు చెందిన 50 మంది యువకులు ఎన్ఎ నియూఐ తాండూరు ఇంచార్జ్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచే సంక్షేమాన్ని కొ నసాగిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, యువకులు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు తాండూరు మండలం మైసమ్మ తాండాకు చెందిన 20 మంది. యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన 35 మంది కూడ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కవి ఎటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.