పాలు, తేనేతో ఆరోగ్యం

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

పాలు, తేనేతో ఆరోగ్యం
– రోజూ తాగితే ప్ర‌యోజ‌నాలెన్నో
– ఉప‌యోగాలు తెలిస్తే అల‌వాటు మానుకోరు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అన్ని రకాల పోషకాలు ఉన్న పాలు మ‌నిషి బ‌ల‌వ‌ర్ద‌క శ‌రీరానికి తోడ్ప‌డుతాయి. చ‌ర్మానికి, ఆరోగ్యానికి తేనే ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పాలు, తేనే క‌లిపి తీసుకోవ‌డంలో ఎన్నో ప్ర‌యోజ‌కాలు ఉన్నాయ‌ని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ప్ర‌తిరోజు పాలు, తేనే తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయ‌ని చెబుతున్నారు. పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిలో మార్పులు
మ‌నిషి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎంతో ముఖ్యం. పాలు – తేనే క‌లయిక‌లో ఉండే ప్రోటీన్-కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బ‌రువు, ఊభ‌కాయం దూరం
ప్రతి రోజు పాలలో తేనె కలిపి తాగితే అధిక బ‌రువు, ఊభ‌కాయ స‌మ‌స్య‌లు కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి. ప్రస్తుత రోజుల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. చాలా మంది దానిని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. పాలు, తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీర బరువును నియంత్రించి ఊబకాయాన్ని దూరం చేస్తాయి.

శ్వాసకోశ సమస్యలకు ప‌రిష్కారం
మీకు ఏదైనా శ్వాసకోశ సమస్య ఉంటే పాలు – తేనె మిశ్రమం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల ఎలాంటి శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటే పాలు, తేనె కలుపుకుని తాగాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.

ఒత్తిడి దూరం
నేటి జీవనశైలి కారణంగా అనేక రకాల ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. మీరు కూడా ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతుంటే పాలు – తేనె మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలపడం వల్ల ఒత్తిడి అదుపులో ఉండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పరిశోధన ప్రకారం పాలు ఎముకలను బలపరుస్తాయి.. తేనె నరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.

ముఖం మెరుస్తుంది
మీ ముఖం నిగారింపు కోసం తేనె కలిపిన పాలను తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ముఖం మెరిసిపోయి సహజసిద్ధమైన కాంతిని సంతరించుకుంటుంది. దీనితో సౌందర్య సాధనాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.