బాడీ బిల్డర్‌కు సీఎంఆర్ఎఫ్ చేయూత

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

బాడీ బిల్డర్‌కు సీఎంఆర్ఎఫ్ చేయూత
– రూ.14 లక్షల ఎల్‌ఓసీని అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపిన కుటుంబ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంలో బాధపడుతున్న బాడీ బిల్డర్‌కు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్థిక చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం శాంతినగర్ కు చెందిన నియామతుల్లా షరీఫ్ కుమారుడు అమానుల్లా(రిజ్వాన్, బాడీ బిల్డర్) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్లోలోని బసవ తారకం ఆసుపత్రికి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే అమానుల్లా చికిత్స కోసం ప్రభుత్వం నుంచి సహాయం అందించేలా చూడాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందిస్తూ అమానుల్లా చికిత్సకు అవసరమయ్యే రూ. 14 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరయ్యేలా కృషి చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పేదలు అనారోగ్యానికి గురై ఆపదలో ఉన్నప్పుడు సీఎంఆర్ఎప్ పథకం అండగా నిలుస్తోందని అన్నారు. మరోవైపు అమానుల్లా చికిత్సకు రూ. 14 లక్షల భారీ ఆర్థిక సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఉన్నారు.