బోన‌మ్మ గుడి వ‌ద్దే ద‌స‌రా సంబ‌రాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

బోన‌మ్మ గుడి వ‌ద్దే ద‌స‌రా సంబ‌రాలు
– నిర్ణ‌యించిన హిందూ ఉత్స‌వ స‌మితి
– హాజ‌రు కానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని పాత తాండూరు బోన‌మ్మ గుడి(భ‌వాని మాత‌) వ‌ద్ద ద‌స‌రా ఉత్స‌వాలకు ఏర్పాట్లు చేసిన‌ట్లు హిందూ ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల న‌ర్సింలు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌తి యేడాది బోన‌మ్మ గుడి వ‌ద్ద ద‌స‌రా ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సారి కూడ అక్క‌డే ఉత్స‌వాలు ఏర్పాట్లు చేసిన‌ట్లు ప‌ట్లోళ్ల న‌ర్సింలు తెలిపారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పారు. ప‌ట్ట‌ణంలోని నెహ్రుగంజ్ రేణుకా ఎల్ల‌మ్మ దేవాల‌యం నుంచి ర్యాలీ ప్రారంభ‌మవుతుంద‌ని తెలిపారు. హిందూ, కుల‌, రాజ‌కీయ సంఘాల ప్ర‌తినిధులు పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. బోన‌మ్మ దేవాల‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన ఉత్స‌వాల‌కు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల‌తో పాటు జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ రాజుగౌడ్, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, అన్నీ పార్టీల నాయ‌కులు పాల్గొంటార‌ని తెలిపారు. హిందూ బందువులు, ప్ర‌జ‌లు భారీ ఎత్తున పాల్గొని ద‌స‌రా ఉత్స‌వాల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కోరారు.