సీసీఐ రాములు కుటుంబానికి ఆర్థిక సాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

సీసీఐ రాములు కుటుంబానికి ఆర్థిక సాయం
– అంత్య‌క్రియ‌ల‌కు రూ. 20 వేలు అందించిన ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దళిత నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సీసీఐ రాములు కుటుంబానికి తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్ ఆర్థిక సాయం అందించారు. ఆదివారం సీసీఐ రాములు క‌న్నుమూశారు. సోమ‌వారం తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠ‌ల్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాములు అంత్యక్రియల కోసం రూ. 20వేల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంద‌ర్భంగా విఠ‌ల్ నాయ‌క్ మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు. చైర్మన్ వెంట కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, హరి గౌడ్, హేమంత్, కావలి సంతోష్, మొయిన్, సురేష్, వెంకట్, తదితరులు ఉన్నారు.