జై.. బీఆర్ఎస్.. జైజై బీఆర్ఎస్
– తాండూరులో గులాబీ నేతల సంబరాలు
– దేశ భవిష్యత్తులో మార్పు ఖాయం : నేతల హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి: జై.. బీఆర్ఎస్.. జై జై బీఆర్ఎస్.. అంటూ తాండూరు గులాబీ నేతలు హోరెత్తించారు. టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం తాండూరులో సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఈ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున టపాసులు, బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ బీఆర్గా మారిన సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనంతరం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దేశం బాగుపడాలని సీఎం కేసీఆర్ తపిస్తున్నారని, రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందించేందుకు యోచిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో దేశ వ్యాప్తంగా మార్పు సాధించడం ఖాయమని, సీఎం కేసీఆర్ పీఎం అవుతారని ఆభిలాషించారు. దేశ ప్రజల మద్దతు సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్కు తప్పకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ముక్తార్, పట్టణ కార్యదర్శి సంతోష్ గౌడ్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

