అతిసార బాధితులకు మంచ్ చేయూత
– ఫిల్టర్ వాటర్ పంపిణీ చేసిన మార్వాడి యువమంచ్
– జంటుపల్లిలో ఇంటింటికి సరఫరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతిసార బారిన బాధితులకు తాండూరు మార్వాడి యువమంచ్ చేయూతనందించింది. యాలాల మండలం జుంటుపల్లిలో అతిసార విజృంభణ వల్ల గ్రామస్తులు ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త విజ్ఞప్తి మేరకు తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో జుంటుపల్లి గ్రామానికి ఫిల్టర్ వాటర్ పంపిణీ చేశారు. మొత్తం 120 క్యాన్‌లలో శుద్దినీటిని మూడు ఆటోలలో సరఫరా చేశారు. గ్రామ కార్యదర్శి సునిల్ కుమార్ సమక్షంలో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సార్డా, అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి తదితరులు మాట్లాడుతూ అతిసార నియంత్రణలో భాగంగా మంచ్ తరుపున సేవలందించడం జరిగిందన్నారు. మరోవైపు జుంటుపల్లికి ఫిల్టర్ వాటర్ పంపిణీ చేయడం పట్ల గ్రామస్తులు మార్వాడి యువమంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచ్ కోశాధికారి అరుణ్ సార్డా, అనిల్ సార్డా, లక్ష్మీనారాయణ బూబ్, మధు సోని తదితరులు పాల్గొన్నారు.

