వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, 13వ వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తన వార్డులో పరిధిలోని మిత్రానగర్, మార్కండేయ కాలనీలలో మున్సిపల్ ద్వారా మురుగుకాలువలలో దోమల నియంత్రణకు అయిల్ బాల్స్ వేయించారు. శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఆయా కాలనీలలో అయిల్ బాల్స్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ, మలేరియా ప్రభలకుండా దోమల నియంత్రణలో భాగంగా అయిల్ బాల్స్ వేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రాజారత్నం, భాగ్యమ్మ, మున్సిపల్ జవాన్ వెంకటేష్, కార్మికులు ఉన్నారు.

