బ్యాంకులకు 9 రోజులు మూత

కెరీర్ జాతీయం తెలంగాణ హైదరాబాద్

బ్యాంకులకు 9 రోజులు మూత
– వచ్చేనెలలో సెలవు దినాలు
– ఏ రోజుల్లో ఉంటాయో తెలుసుకోండి
దర్శిని డెస్క్‌: వచ్చే నెల నవంబర్‌లో 9 రోజుల పాటు బ్యాంకులు మూతపడబోతున్నాయి. ప్రతి నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ఈ సెలవులను అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని విడుదల చేస్తుంటుంది. ఇవి రాష్ట్రాల బట్టి ఉంటాయని గమనించాలి. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 9 నుంచి 10 రోజుల పాటు సెలవులు రానున్నాయి. బ్యాంకు కస్టమర్లు ముందస్తు ప్లాన్‌ చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు సెలవులలో రెండో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరి నవంబర్‌ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.

1. నవంబర్ 6 – ఆదివారం
2. నవంబర్ 8 – గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి..అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోచి, పాణాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో సెలవు
3. నవంబర్ 11 – కనకదాస జయంతి-వంగల పండుగ..బెంగళూరు, షిల్లాంగ్‌లో సెలవు
4. నవంబర్‌ 12 – రెండో శనివారం
5. నవంబర్‌ 13 ఆదివారం
6. నవంబర్‌ 20 – ఆదివారం
7. నవంబర్‌ 23 – సేంగ్‌ పండగ (షిల్లాంగ్‌లో సెలవు)
8. నవంబర్‌ 26- నాలుగో శనివారం
9. నవంబర్‌ 27 – ఆదివారం
10. నవంబర్‌ 1న – కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం, బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు