ఎగ్జామ్ సెంటర్‌లో సెల్‌ఫోన్..!
– అరగంట తరువాత పట్టుబడిన అభ్యర్థి
– కేసు నమదు చేసిన పోలీసులు
– ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదయ్యింది. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. పరీక్ష మొదలైన్ అరగంట తరువాత అధికారులు గుర్తించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లోని సక్సెస్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించి.. అభ్యర్థి నుంచి ఫోన్ తీసుకుని సీజ్ చేశారు. మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు.రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. 8,180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష కు, మధ్యాహ్నం 2.30గంటలకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
ఇది కూడా చదవండి…


