కార్మికులను విస్మరించడం విచాకరం

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులను విస్మరించడం విచాకరం
– పెంచిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
– కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన బీసీ సంఘం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ పరిశుభ్రతకు పాటుపడే కార్మికులను విస్మరించడం విచారకరమని బీసీ సంఘం నేతలు అన్నారు. గత ఆరు రోజులుగా తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. గురువారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు, పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, రాష్ట్ర కార్యదర్శి సయ్యదు షుకూర్‌లతో కలిసి కార్మికుల సమ్మెలో బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెంచిన పీఆర్సీ కోసం మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి రోడ్డుపై దీక్ష చేస్తుండడం చాలా విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా కొత్త పీఆర్సీ అమలవుతుంటే తాండూరులో అమలు చేయకపోవడం కార్మికులను విస్మరించడమే అన్నారు. అధికారులు, పాలకులు వెంటనే కార్మికులకు పెంచిన పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం తాండూరు నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు నాయి కోడి జ్యోతి, మండల యువజన సంఘం అధ్యక్షుడు బసంత్ కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, యువ నాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, మతిన్, మాధవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.