డిగ్రీ కాలేజీలో దోస్త్ పిలుస్తోంది..!
– తాండూరు కాలేజీలో సహాయక కేంద్రం ఏర్పాటు
– ఈసారి అందుబాటులో కొత్త కోర్సులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దోస్త్ ద్వారా ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఎస్. లక్ష్మణ్, దోస్త్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డిలు తెలిపారు. శనివారం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న కాలేజీలో దోస్త్ సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కాలేజీలో దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. కాలేజీలో వివిధ కోర్సులలో చేరేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళాశాల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సహాయక కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే సెల్: 9885583432కు సంప్రదించవచ్చని తెలిపారు.
అదేవిధంగా కాలేజీలో ఈ విద్యా సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. బీఎస్సీ (ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్), బీకాం(కంప్యూటర్ అప్లికేషన్), బీఏ(కంప్యూటర్ అప్లికేషన్), బీఏ(మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం), బీఏ (సోసియాలజీ, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, జీయోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులను ప్రారంభించడం జరిగిందని వివరించారు. దీంతో పాటు డిజిటల్ ల్యాబ్ సౌకర్యం, వర్చ్యువల్ తరగతి గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

