సంకిరెడ్డిపల్లి తాండా రోడ్డుకు మహర్ధశ
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సహాకారంతో సీసీ రోడ్డు
– శంకుస్థాపన చేసిన సర్పంచ్, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో సంకిరెడ్డిపల్లి తాండాకు సీసీ రోడ్డుకు మహర్దశ వచ్చిందని టీఆర్ఎస్ నేతలు అన్నారు. సోమవారం తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి నుంచి సంకిరెడ్డిపల్లి తాండా వరకు మంజూరైన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 1 కోటి కిలక్షలతో చె పట్టే ఈ పనులను సంకిరెడ్డిపల్లి సర్పంచ్ అమృత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంలింగా రెడ్డిలు తాండా, గ్రామ పెద్దలతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామం నుంచి తాండా వరకు సీసీ రోడ్డు మంజూరు చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సమస్య తీరుతుందన్నారు. రోడ్డు సమస్యను తొలగించినందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతుృతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాంశెట్టి, రె షన్ డీలర్ టక్కప్ప, మాజీ ఎంపీటీసీ మోహన్ సింగ్, కైర్యా నాయక్, శివరాం, భద్రునాయక్, వి. చరణ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

