ఆర్టీసీలో ‘ఒకటి’కి ఇక ఫ్ర్రీ
– మూత్రశాలల సేవలు ఉచితం
– తాండూరు డీపో మేనేజర్ సమత
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆర్టీసీ సంస్థ ఆధాయంతో పాటు ప్రయాణికులకు ఉపయోగకరమైన సేవలను అందించడంలో ప్రత్యేక దృష్టిని సారిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు వివిధ డీపోలలో ప్రయాణికులకు సేవలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కోడంగల్ బస్టాండ్లలో మూత్రశాలల సేవలను ఉచితం చేయడం జరిగిందని తాండూరు డీపో మేనేజర్ టీ.సమత ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా బస్టాండ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లే.. వచ్చే ప్రయాణికులు ఒకటికి వస్తే మూత్రశాలలను ఉచితంగా వినియోగించుకోవచ్చని సూచించారు. దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో బస్సుల సమాచారం కోసం ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా సెల్: 8985980075కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని సంస్థ ప్రగతికి అందరు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

