మత్య్స సంపదతోనే అర్థికాభివృద్ధి
– ఉచిత చేప పిల్లలలను సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల
– జినుగుర్తి శ్రీరాములోరి ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మత్స్య సంపదతో కుల వృత్తి దారులు ఆర్థికాభివృద్ది చెందాలని తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, జెడ్పీటిసి గౌడి మంజుల అన్నారు. శనివారం తాండూరు మండలం జినుగుర్తి గ్రామ పరిధి శ్రీరాములవారి ప్రాజెక్టులో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజులలు నేతలతో కలిసి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్య్స కారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందన్నారు. కుల వృత్తులను ఆదుకోవడంతో పాటు మత్య్స సంపదను పెంచడంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. చెరువుల్లో చేప పిల్లలను పెంచి మత్య్సకారులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్ రాం రెడ్డి. అధికారి సత్యనారాయణ రెడ్డి, నాయకులు, సంఘం సభ్యులు కోలగిరి శ్యామప్ప, న్యాయవాది నరేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

