రైలు ఇంజిన్‌నే దొంగించిన దొంగలు
– సొరంగం తవ్వి ఎత్తుకెళ్లిన ఘనులు
– ఎలా చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
దర్శిని డెస్క్ : పురుషులందు పుణ్య పురుషులు వేరయా.. అన్నట్లుగా దొంగల్లో తమాషా దొంగలు మేము అంటూ ఇటీవల వింత దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా వింత దొంగతనాలు తెరపైకి వస్తున్నాయి. మహారాష్ట్రలో దొంగలు సెల్‌టవర్‌ను ఎత్తుకెళ్లగా.. తాజాగా బిహార్ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్‌నే ఎత్తుకెళ్లారు. దొంగల సాధించిన ఈ ఘనత బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెగుసరాయ్ జిల్లాలోని రైల్వే యార్డు నుంచి డీజిల్ ఇంజిన్‌ను దొంగిలించేందుకు పెద్ద ప్లాన్ వేశారు. రైల్వే యార్డుకు ఏకంగా సొరంగాన్నే తవ్విన దొంగలు.. రైలు ఇంజిన్ విడిభాగాలను దొంగిలించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో మరమ్మతుల కోసం గర్హరా యార్డుకు తీసుకొచ్చిన మొత్తం డీజిల్ ఇంజిన్‌కు చెందిన విడిభాగాలు, ఇంజన్ చక్రాలు దోచుకెళ్లారు. గత వారంలో ఈ చోరీపై బరౌని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దర్యాప్తు చేపట్టిన ముజఫర్ నగర్ పోలీసులు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురిని విచారించగా రైల్వే యార్డుకు సొరంగం తవ్వి.. దాని ద్వారా వారు లోకోమోటివ్ భాగాలు, ఇతర వస్తువుల్ని బస్తాలతో తీసుకెళ్లినట్లు నిర్థారించారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా ముజఫర్‌పూర్ జిల్లా ప్రభాత్‌నగర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో సోదాలు జరపగా 13 బస్తాల నిండా రైలు విడిభాగాలు లభ్యమైనట్టు పోలీసు అధికారి దూబే తెలిపారు. దీంతో ఆ గోదాం యజమాని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఇంజిన్ విడిభాగాలతో పాటు వింటేజ్ రైలు ఇంజిన్ల చక్రాలు, భారీ ఇనుముతో తయారైన రైలు విడిభాగాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాకుండాస్టీల్ వంతెన బోట్లు విప్పి విడిభాగాలు తీసుకెళ్లిన ఘటనల్లోనూ ఈ ముఠా ప్రమేయం ఉందన్నారు.

