అక్టోబర్‌లో రిపబ్లిక్
– రెండో పాట విడుదలకు సిద్దం
దర్శిని : సాయితేజ్ కథానాయకుడిగా, ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రిపబ్లిక్. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్న చిత్ర నిర్మాతలు. జి. స్టూడియోస్‌తో కలిసి జె.పుల్లారావు, జె.భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మణిశర్మ స్వరాలందిస్తున్న ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జోర్నే బరే’ అంటూ సాగే ఈ పాటను ఈనెల 6న ఉదయం 11 గంటలకు విడుదల చేయను న్నట్లు సాయితేజ్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రచార వీడియోని ట్విటర్లో పంచుకు న్నారు. విభిన్నమైన పాలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. రమ్యకృష్ణ, జగప తిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

