ఆరోగ్య తెలంగాణకు సర్కారు కృషి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో ఎన్సీడీ మందుల కిట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆరోగ్య తెలంగాణ కోసం సర్కారు కృషి చేస్తోందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల(బీపీ, షుగర్) కోసం డీసీజెన్ (ఎన్సీడీ) మందుల కిట్ల పంపిణీని పట్టణంలోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై బాధితులకు మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని.. ఇందులో భాగంగా బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడే వారికి మందుల కిట్లను అందజేస్తుందన్నారు. ఈ మందులను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా.ధరణి కుమార్, మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, వార్డు కౌన్సిలర్ రవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

