ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం
– కీలక ప్రకటన చేసిన ఇంటర్ బోర్డు
– చివరి గడువు ఎప్పటి వరకు అంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ ప్రవేశాలపై బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. ఇందులో ప్రవేశాలు ఎప్పటి వరకు చేసుకోవచ్చనే గడువు తేదినీ కూడ వెల్లడించింది. ఈ ఏడాది ప్రవేశాలు జూన్‌లో మొదలు కాగా.. పలుమార్లు గడువును పొడిగించిన బోర్డు.. చివరకు అక్టోబరు 15వ తేదీకి ముగించింది. అయితే, ఇప్పటి వరకు 3.50 లక్షల మంది విద్యార్థుల పేర్లే ఇంటర్ బోర్డు లాగిన్ పరిధిలోకి వచ్చాయి. వారికి మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అర్హత ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు గడువుగా పేర్కొంది. దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది అడ్మీషన్స్ బోర్డు ఆన్‌లైన్‌లోకి ఎక్కకపోవడంతో.. యాజమాన్యాలకు లాగిన్ అయ్యే అవకాశం లేకపోవడంతో విద్యార్థుల కోసం ఈ గడువును మరోసారి పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టియర్‌లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అర్హత గల విద్యార్థులు నవంబర్ 27వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
నెలాఖరు వరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు..
వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు సైతం ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 30వ తేదీ వరకు ఉంటుందని ప్రకటించింది. రూ. 100 ఆలస్యం రుసుంతో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ మధ్యలో పరీక్ష ఫీజు చెల్లించొచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు చెల్లించొచ్చు. రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు, రూ. 2000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల కోసం అదనంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుందని, ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.710 చెల్లించాలని బోర్డు అధికారులు సూచిస్తున్నా

