శ్రీవారి భక్తులకు అలర్ట్‌

జాతీయం తెలంగాణ హైదరాబాద్

శ్రీవారి భక్తులకు అలర్ట్‌
– నెలరోజులు సుప్రభాత సేవ రద్దు
– ఎప్పటి నుంచి అంటే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ప్రకటన చేసింది. ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ప్రతి రోజు తెల్లవారు జామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. శ్రీవారి సేవల్లో సంప్రదాయాల కొనసాగింపులో భాగంగా ఇప్పుడు నెల రోజుల పాటు ఈ సేవను రద్దు చేసి తిరుప్పావై సేవను నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపటి నుంచి జనవరి 14 వరకూ తిరుప్పావై పఠనం జరగనుంది. సాయంత్రం నుంచే ఆలయంలో సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావైతో మేల్కోలుపు సేవ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆగమ శాస్త్రంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆ తర్వాతే అన్ని కైంకర్యాలు ప్రారంభం అవుతాయి.