ఘనంగా గోపూజ
– పూజలు చేసిన జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి కుటుంబం
– గోశాలలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి సీతారాం పేట్‌లోని గోశాలలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం అమావాస్య సందర్భంగా రాత్రి గోశాల అధ్యక్షులు, ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి దంపతులతో పాటు వారి కుటుంబం గోపూజలో తరించారు. గోశాలలో ఉన్న తులసీ మాత, గణపతి, శ్రీకృష్ణుడులకు పూజలు చేసిన అనంతరం గోవులకు పూజలు నిర్వహించారు. వికారాబాద్ కు చెందిన విశ్వం పంతులు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా కొనసాగాయి. వేదమంత్రాలు, గోపూజలతో గోశాలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి కుటుంబంతో పాటు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కూడ తన జన్మదిన సందర్భంగా గోవులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరుకు చెందిన సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకరాదవ్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పద్దోళ్ల నర్సింలు, కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అనురాధ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, సీనియర్ జిల్లా రిపోర్టర్ రవిశంకర్, పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, తాండూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కొట మురళీకృష్ణ, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, దళిత సంఘం నాయకులు ప్రేమ్ రాజ్, గోశాల కమిటి సభ్యులు సాయిపూర్ బాల్ రెడ్డి, పటేల్ విజయ్ కుమార్, సిరిగిరిపేట్ రాము. ఓం ప్రకాష్ సోమాని, కోట్రిక కిరణ్, మల్లికార్జున్, లింగదలి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

