రైల్వే స్టేషన్ల పురోగతిపై దృష్టి

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

రైల్వే స్టేషన్ల పురోగతిపై దృష్టి
– ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
– ప్రజల ఫిర్యాదులపై రైల్వే బోర్డుకు నివేధికలు
– రైల్వే మంత్రిత్వ శాఖ పీఏసీ సభ్యుల బృందం
– తాండూరు రైల్వే స్టేషన్ ను సందర్శించిన బృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైల్వే స్టేషన్ల పురోగతిపై దృష్టిసారించడం జరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల సౌకర్యాల కమిటీ(పీఏసీ) సభ్యుల బృందం పేర్కొంది. మంగళవారం వికారబాద్ జిల్లాలోని తాండూరు రైల్వేస్టేషన్ ను పీఏసీ బృందం సందర్శించింది. ఈ బృందంలో పీఏసీ కోఆర్డినేటర్ రవిచంద్రన్, సభ్యులు ఉమారాణి, మధుసూధన, నిర్మల కిషోర్ బొల్లిన, దిలీప్ కుమార్ మల్లిక్, కైలాష్ లక్ష్మణ్ వర్మ, అబిజిత్ దాస్, సునీల్ కుమార్, రాం కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సభ్యుల తరుపున సభ్యురాలు ఉమారాణి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని రైల్వేస్టేషన్లు అన్ని స్వచ్చతగా, శుభ్రంగా ఉంచేందుకే పీఏసీ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటి వరకు 18 రాష్ట్రాలకు పైగా పర్యటించి 450 రైల్వే స్టేషన్లలను సందర్శించడం జరిగిందన్నారు. ఆయా స్టేషన్లల డీఆర్ఎంలతో సమావేశం నిర్వహించి రైల్వే స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే వసతి వంటి సమస్యలపై రైల్వే బోర్డుకు తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ప్రయాణికులు, ప్రజలు అందించిన ఫిర్యాదులను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కరోనా సమయంలో ఆగిపోయిన రైళ్లను పునరుద్దించే ఫిర్యాదులు, పలు స్టేషన్లలో రైళ్లను నిలపాలనే విజ్ఞప్తులు, వివిధ సేసన్లలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలపై విషయాలపై కూడ వచ్చిన ప్రస్తావించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ప్రజలు చాలా ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు వికారాబాద్ కు పొడగింపుకు అభ్యర్థనను రైల్వే బోర్డుకు అందిస్తామని తెలిపారు. దీంతో పాటు పలు రైళ్లకు జనరల్‌ భోగీలను పెంచే విషయంలో కూడ బోర్డుకు నివేదిస్తామన్నారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారంతో పాటు రైల్వే స్టేషన్ల పురోగతికి దృష్టిసారించడం జరుగుతుందని పేర్కొన్నారు.

అనంతరం పీఏసీ సభ్యుల బృందం రైల్వే స్టేషన్లోని ప్రయాణికులతో మాట్లాడారు. సదుపాయాలు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. అంతేకాకుండా ప్రయాణికుల ప్రాంగణం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి భవనం, రైల్వే ప్లాట్ ఫారాలు, రైల్వే శాఖ విభాగాలను పరిశీలించారు. వారి వెంట రైల్వే డీఆర్ఎం, బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, నాయకులు ఎం. రమేష్. నందకుమార్ యాదవ్. పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు.