విశ్వ మానవుడు స్వామి వివేకానందా
– యువత ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకోవాలి
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– వికారాబాద్‌లో వివేకానందకు నివాళులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: భారత సంస్కృతిని ప్రపంచానికి చాటి స్వామి వివేకానంద విశ్వ మానవుడుగా నిలిచారని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. గురువారం స్వామి వివేకానంద జయంతిని సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో రాజుగౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ దేశ చరిత్రను, సంస్కృతిని ప్రంపచానికి చాటిన స్వామి వివేకానందుడు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. లేవండి, మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి, విజయం వరించిందని విర్రవీగకు.. ఓటమి ఎదురైందని నిరాశ చెందకు, విజయమే అంతం కాదు, ఓటమి తుది మెట్టు కాదు. వంటి సూక్తులతో దేశంలోని యువతకు స్పూర్తి ప్రధాతగా నిలిచారని అన్నారు. స్వామి వివేకుని సిద్ధాంతాన్ని, బోధనలను యువతరం పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చూపించిన మార్గంలో నడిచి దేశాన్ని అన్ని రంగాలలో ముందువరుసలో నిలబెట్టేలే కృషి చేయాలన్నారు.

