సంక్రాంతి ఎంతో విశిష్టమైనది

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సంక్రాంతి ఎంతో విశిష్టమైనది
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
– గాంధీనగర్‌లో డ్వాక్రా మహిళతో సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ ఎంతో విశిష్టమైనదని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం తన 20వ వార్డులోని డ్వాక్రా భవనంలో కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ మహిళలకు సంక్రాంతి పండగపై అవగాహన కల్పించారు. సంక్రాంతి పండగ ఎంతో విశిష్టమైనదని అన్నారు. సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరంలో ప్రవేశిస్తాడు కాబట్టి దక్షణాయ నుండి ఉత్తరాన ఉత్తరాయనకు ప్రయాణిస్తున్నందున అన్ని కీడుల నుంచి ఇక మంచే జరుగుతుందని విశ్వాసం దాగుందన్నారు. అందుకనే ప్రజలు నమ్మకంతో సంక్రాంతిని జరుపుకుంటారని అన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండగలో శాస్త్రీయత కూడ దాగుందని అన్నారు. మొదటి రోజు భోగిలో రేగుపండ్లతో చిన్నపిల్లలకు తలపై పోసి వారికి ఎలాంటి కీడు జరగదని, నువ్వులతో తినడం, స్నానం చేసేటప్పుడు శరీరం ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయ పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. కావున సంక్రాంతి పండగ ఎంతో విశిష్టమైనదన్నారు. ఈ పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని మహిళలకు బొట్టు పెట్టి.. నువ్వుల లడ్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ శోభ, ఓబి లలిత, కౌసల్య, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.