రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
– గోదాంల నిర్మాణంతో రైతులకు మేలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రూ.1.48 కోట్ల గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ శివారులో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్, ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో రూ. 1కోటి 48 లక్షలతో నిర్మించే గోదాంల నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, వైస్ ఎంపీపీ స్వరూపా వెంకట్ రామ్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నారని అన్నారు. పంటలకు గిట్టు బాటు ధర కల్పించడంతో పాటు రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రైతులను అన్ని, విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ప్రభుత్వం ద్వారా రూ.1.48 కోట్లతో నిర్మిస్తున్న గోదాం నిర్మాణం అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర రాని సమయంలో గోదాంలో నిల్వ ఉంచుకుని ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చన్నారు. గోదాంలోనే ఉల్లి స్టోరేజీ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా గోదాం కోసం మెయిన్ రోడ్డు నుంచి రూ.10లక్షలతో రోడ్డు మంజూరు చేయిస్తామని అన్నారు.

మరోవైపు డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గోదాం నిర్మాణానికి ఒక ఎకరా స్థలంతో పాటు రూ.1.48 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, డైరెక్టర్లు రాఘవేందర్, వెంకట్రామ్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, పెండా నర్సింలు, సురేందర్ రెడ్డి, వడ్ల బిచ్చన్న, పార్వతమ్మ, సిద్ధయ్య స్వామి, సీఈఓ శ్రీనివాస్, ఏ ఈ సీఓ చంద్రారెడ్డి, సర్పంచులు నందిని యాదయ్య గౌడ్, ఎ. రాములు, మేఘనాథ్ గౌడ్, లాల్ రెడ్డి, కుర్వ నాగార్జున, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, ఎంపీటీసీలు సుశీలమ్మ, శాంతు, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, పటేల్ ఉమాశంకర్, శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రావుల అమ్రేష్, విష్ణువర్ధన్ రెడ్డి, వీరందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, వెంకటేష్, నాగప్ప, ప్రభు, అంజిలయ్య, చెన్నయ్య, సంజీవ రెడ్డి, యువనాయకులు రాకేష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రాజుగౌడ్, కొల్లాపూర్ రేణుకా ఎల్లమ్మ చైర్మన్ సందీప్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

