విద్యార్ధులకు మంచ్ తోడ్పాటు
– యూనిఫామ్స్ అందజేసిన మార్వాడి యువమంచ్
– 50 మంది విద్యార్థులకు పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడి విద్యార్థులకు తాండూరు మార్వాడి యువమంచ్ తోడ్పాటు అందించింది. శుక్రవారం తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ను అందజేశారు. మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా సమక్షంలో మంచ్ జాతీయ కార్యక్రమం ఆనంద్ సబ్ కే లియే లో భాగంగా సమాజ పెద్దలు మురళీధర్ గగ్రాని, మార్వాడి యువమంచ్, రాజస్థానీ మహిళ మండలి సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఈ యూనిఫామ్స్ ను అందజేశారు.

ఈ సందర్భంగా మన్మోహన్ సార్డా, మంచ్ సభ్యులు మాట్లాడుతూ విద్యా, వైద్య రంగానికి తోడ్పాటు అందించడంలో మార్వాడి యువంచ్ ముందు ఉంటుందని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు దుస్తులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజస్థానీ మహిళ నుండలి అధ్యక్షురాలు పద్మ సోని, కార్యదర్శి కిరణ్ సార్డా, కోశాధికారి సంగీత పర్తాని, మార్వాడి యువమంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ కుమార్ సార్డా, కుంజ్ బిహారి సోని, దీపక్ గగ్రాని, లక్ష్మీనారాయణ బూబ్, అనిల్ సార్డా, ఆశిష్ సార్డా, శ్రీగోపాల్ రాఠీ తదితరులు పాల్గొన్నారు.


