సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
– వేతనాల పెంపుపై మధ్యాహ్న భోజన కార్మికుల హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తాండూరు మధ్యాహ్న భోజన కార్మికులు పాలాభిషేకం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ కార్మిక విభాగం తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది గోపాల్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన యూనియన్ కార్మికులు సంబరాలు జరుపకున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 3 వేల వేతనం పెంచడం పట్ల బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికులకు అడగకుండానే వేతనాలు పెంచుతున్నారని అన్నారు. తాజాగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలను పెంచి కార్మికుల పక్షపాతిగా నిలిచారని అన్నారు. వేతనాల పెంపుతో రాష్ట్రంలోని 54201 మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 600లు ఉంటే తెలంగాణ ప్రభుత్వం రూ. 2400లు అందిస్తుందని అన్నారు. దీంతో పాటు కార్మికులకు డీఏ, పీఆర్సీ వేతనాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.