సంక్షేమ సారథి సీఎం కేసీఆర్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సంక్షేమ సారథి సీఎం కేసీఆర్
– అన్ని రంగాల, వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం
– తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు
– బీఆర్ఎస్ వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పాలన అందించి సంక్షేమ సారథిగా నిలుస్తున్నారని తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు డివిజన్ ఇంచార్జ్ జిలానీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ఐనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీటీసీ ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, గ్రామ సర్పంచ్ స్వప్న జ్యోతి చంద్రశేఖర్ రెడ్డి, మహిళ కన్వినర్ శకుంతల, నాయకులు పటేల్ ఉమా శంకర్ తదితరులు హాజరై పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారని అన్నారు. గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు. దీంతో పాటు అసరా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బందు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అమ్మాయిలు, మహిళలు, వృద్ధులకు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి మానస యాదవ్, రెండో బహుమతి కే నిహారిక, మూడో బహుమతి కే.అఖిల సాధించడంతో వారికి బహుమతులతో పాటు నగదు కూడ అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి, బిజ్ఞారం గ్రామాల సర్పంచులు జగదీశ్వర్, నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ గోవింద్, బీఆర్ఎస్ నాయకులు దీపక్ రెడ్డి, పరమేష్, సుజార్, ప్రిన్సిపల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.