మహా శివరాత్రి రోజు గోల్డ్ గిఫ్ట్‌..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

మహా శివరాత్రి రోజు గోల్డ్ గిఫ్ట్‌..!
– భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
– ఈరోజు ఎంత తగ్గాయంటే
దర్శిని డెస్క్‌: దేశంలో పసిడి ధరలు రోజు రోజూ తగ్గుకున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్‌ పడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. శనివారం (ఫిబ్రవరి18) 22 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 200 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.220 తగ్గడం విశేషం. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,510 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శనివారం కిలో వెండిపై రూ.400 తగ్గడం విశేషం. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.68,600 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.