అమానుషం..!
– మైనర్ బాలికపై అత్యాచారం
– యాలాల మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో అమానుషం జరిగింది. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పేర్కంపల్లి తాండాకు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. పేర్కంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో యువకుడి అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు యాలాల పోలీసులను ఆశ్రయించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.

