హస్తంలో హర్షాతిరేకం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తంలో హర్షాతిరేకం..!
– రుణమాఫీపై సంబరాలు
– సీఎం రేవంత్ రెడ్డి చిత్రానికి పాలాభిషేకం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో బైకు ర్యాలీ
– బీఆర్ఎస్, హరీష్‌రావులపై విమర్శల విసుర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతు రుణమాఫీ అమలుపై తాండూరులోని హస్తం పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. గురువారం తాండూరు పట్టణంలో రూ.1లక్ష రుణమాఫీ అమలుపై సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ బైకు ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ జెండా పట్టుకుని ఉత్సహాంగా కదిలారు. అక్కడి నుంచి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, న్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డి, సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్‌ బాల్‌ రెడ్డి తదితరులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి నినాదాలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ పదేళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీలో విఫలమయ్యిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిందని మండిపడ్డారు. రుణమాఫీ అమలుపై మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావులు చేతకాదంటూ విమర్శలు చేశారని అన్నారు. రైతురుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్న హరిష్‌ రావు దానికి కట్టుబడి రాజీనామాకు సిద్దం కావాలని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తుందన్నారు. మొదటి విడతతో రూ. 1లక్ష, రెండో విడతలో రూ. 1.50లక్షలు, మూడో విడతలో మొత్తం రూ. 2లక్షల రుణమాఫీని అమలు చేయబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతులకు రుణవిముక్తి లభిస్తుందన్నారు. తాండూరు నియోజకవర్గంలో అర్హులైన రైతులందరికి రుణమాఫీ అమలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు, పట్టని నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు ఉత్తమ్ చంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్‌ గౌడ్, రాము, బొంబీనా, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, మహిళ నాయకురాలు గాజుల మాధవి, నాయకులు బంటు వేణుగోపాల్, రాము, జిలాని, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు ఎంపీ కొండాకు పౌర సన్మానం