సూపర్ కానిస్టేబుళ్లు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సూపర్ కానిస్టేబుళ్లు..!
– పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగిచ్చిన వైనం
– తాండూరు పోలీసు సిబ్బందికి అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు సూపర్‌ అనిపించుకున్నారు. ఓ వ్యక్తి పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వివరాలను సేకరించి తిరిగి అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఎన్కెపల్లికి గ్రామానికి చెందిన సత్యం అనే యువకుడు గురువారం రాత్రి తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అయితే తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఇక్బాల్, నగేష్‌లు రాత్రి విధుల్లో ఉండగా రోడ్డుపై సెల్‌ ఫోన్‌ దొరికింది. ఫోన్‌లోని సమాచారం ద్వారా సత్యం అనే యువకుడి వివరాలు లభించాయి. వెంటనే అతనికి సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కు సత్యంను పిలిపించారు. ఎస్ఐ మహిపాల్ రెడ్డి సమక్షంలో కానిస్టేబుళ్లు ఇక్బాల్, నగేష్‌లు సత్యంకు పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు. పోలీస్టేషన్‌ కానిస్టేబుళ్లు నిజాయితీని చాటుకోవడం పట్ల సూపర్ కానిస్టేబుళ్లు అనిపించుకున్నారు. పలువురు పట్టణ వాసులు కానిస్టేబుళ్లను అభినందించారు.