తరతరాలకు ఆదర్శనీయుడు మాణిక్ రావు
– వర్దంతి వేడుకలో తాండూరు నాయకులు
తాండూరు, దర్శని ప్రతినిధి : స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్‌రావు తరతరాలకు ఆదర్శనీయుడని ఆయన ప్రియ శిష్యుడు, సీనీయర్ నాయకులు రాజుగౌడ్ అన్నారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గం కన్వీనర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో వర్దంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని చించొల్లి రోడ్డుమార్గంలో నిర్వహించిన వేడుకలలో మాణిక్‌రావు ప్రియశిష్యులు రాజుగౌడ్ హాజరైన బీసం సంఘం నాయకులు రాజ్‌కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, బీజేపీ నాయకులు పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్ తదితరులతో మాణిక్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో స్వర్గీయ మాణిక్‌రావు జైలుకు వెళ్లారని అన్నారు. మంత్రిగా, నాయకుడుగా మాణిక్‌రావు పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. అటు నాయకులకు రాజకీయ విలువలు నెర్పిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బంటారం లావణ్య, బీసీ సంఘం నాయకులు, మాణిక్‌రావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

