వికారాబాద్ జెడ్సీపీఠం కారుదే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వికారాబాద్ జెడ్సీపీఠం కారుదే..!
– ఎంపీపీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకుంటాం
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేల ధీమా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా జెడ్పీ పీఠంతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్, తాండూరు, పరిగి, కోడంగల్ మాజీ ఎమ్మెల్యేలు అన్నారు.

శనివారం వికారాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నివాసంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు సమావేశం అయ్యారు.
kvcs
ఈ సమావేశంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గుర్తించి.. బరిలో నిలిపేందుకు దృష్టిసారించాలన్నారు. ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా జెడ్పీ పీఠంతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

నేషనల్ హైవేకు బ్రేక్..!