ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
– వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని థారూర్ మండలం ఇబ్బనూరు గ్రామానికి చెందిన నర్సింహా స్వామి(46) వికారాబాద్‌లోని డీటీసీలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వికారాబాద్ సమీపంలో ఓ చెట్టుకు నర్సింహా స్వామి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన నర్సింహా స్వామికి భార్య, కుమారుడు ఉన్నారు.

