మ‌త్య్స‌సంపద పురోగ‌తికి పెద్ద‌పీట‌

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మ‌త్య్స‌సంపద పురోగ‌తికి పెద్ద‌పీట‌
– రాష్ట్రంలో 93 కోట్ల చేపల పంపిణీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం
– త్వ‌ర‌లో తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్ర‌యాలు
– రిజర్వాయువు, చెరువుల్లో రాయితీ చేప‌ల విడుద‌ల
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.స‌బితా ఇంద్రారెడ్డి
– కోట్‌ప‌ల్లి ప్రాజెక్టులో చేప పిల్ల‌ల విడుత‌ల చేసిన మంత్రి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: మ‌త్స్య సంప‌ద పురోగ‌తితో పాటు మ‌త్స్య‌ కార్మికుల జీవ‌నోపాధికి స‌ర్కారు ఎంతో కృషి చేస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప‌ట్లోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న చేప‌ల విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం వికారాబాద్ జిల్లా కోట్‌ప‌ల్లి ప్రాజెక్టు వ‌ద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితామ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాద‌య్య‌, వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల‌తో క‌లిసి ప్రాజెక్టులో చేప పిల్ల‌ల‌ను వ‌దిలారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితారెడ్డి మాట్లాడుతూ కుల వృత్తుల బలోపేతం చేయటానికి, వారు ఆర్థికంగా ఎదగటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా మ‌త్స్య‌కారుల అభివృద్ధి కోసం ప్ర‌తి యేడాది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప పిల్ల‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఈ యేడాది రూ. 89 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నార‌ని తెలిపారు. రూ. 25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరుల్లో విడుదల చేయడం జరుగుతుందని వెల్ల‌డించారు.
గతంలో చేపల కోసం ఆంద్రోళ్ల‌ మీద ఆధార పడే వాళ్ళమ‌ని, నేడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మృతసంపద తెలంగాణలో పెరిగిందన్నారు. 2016 వ సంవత్సరం లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కాళేశ్వరం పూర్తితో దాని కింద ఉన్న చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన మిషన్ కాకతీయతో చెరువుల‌న్నిటికి జ‌లకళ వ‌చ్చింద‌ని, వాటిలో చేప పిల్లలను వదులడం జ‌రుగుతుంద‌న్నారు. అంతేకుండా చెరువులను జియో ట్యాగింగ్ చేయటం జరిగింది. వాటిలో చేప పిల్లల కౌంటింగ్, నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఔట్ లెట్లను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతుంద‌ని.. తద్వారా తెలంగాణ బ్రాండ్ పేరుతో చేపల విక్రయాలు, చేపల వంటకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. తాండూరు, వికారాబాద్ నియోజకవర్గ లలో ఏర్పాటుకు కలెక్టర్ కు ఆదేశించామని స్ప‌ష్టం చేశారు. కోట్‌ప‌ల్లిలో త్వరలో టూరిజం బొట్లు ప్రారంభిస్తామన్నారు. బెస్త ముదిరాజ్, మృత్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ఐదేళ్లుగా రూ. 208 కోట్ల పైచిలుకు నిధులను ఖర్చు చేస్తే రూ. 30 వేల కోట్ల ఆదాయం వచ్చిందని వెల్ల‌డించారు. అదేవిధంగా 15 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి జరిగిందని స్పష్టం చేశారు. మ‌రోవైపు వికారాబాద్ జిల్లాలో 105 మృత్స పారిశ్రామిక సహకార సంఘాలు వాటిలో 4429 మంది సభ్యులు ఉన్నారన్నారు. జిల్లా లో 775 చెరువులు ఉండ‌గా జిల్లాలో 447 మంది కోటి 40 లక్షల రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు. గత ఏడాది రాష్ట్రంలో రూ. 51 కోట్ల 80 లక్షలు ఖర్చు చేసి 18,335 నీటి వనరుల్లో 68 కోట్ల 52 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. 8 కోట్ల 8 కోట్ల 61 లక్షలు ఖర్చు చేసి 4 కోట్ల రొయ్య పిల్లలను 93 నీటి వనరుల్లో వ‌ద‌ల‌డం జ‌రిగింద‌న్నారు.
అదేవిధంగా గత సంవత్సరం 79.33 లక్షల చేప పిల్లలను ఒక చేప 47 పైసల చొప్పున 34 లక్షల 22 వేలు వెచ్చించి చెరువుల్లో వదలడం జ‌రిగింద‌న్నారు. ప్రస్తుతం సంవత్సరం కోటి 14 లక్షలు చిన్న సైజ్ చేప పిల్లలు, 25 లక్షల పెద్ద సైజ్ చేప పిల్లలను 775 చెరువుల్లో వదలడం జరుగుతుందన్నారు. తాజాగా 100 శాతం రాయితీ పై రిజర్వాయర్లు, ప్రాజెక్ట్ లు, చెరువులలో చేప పిల్లలను వదులుతున్నామన్నారు. ప్ర‌భుత్వ ఆశ‌యాల మేర‌కు మ‌త్స్య‌కారులు ఉచిత చేప పిల్ల‌ల పంపిణీతో అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో వికారాబాద్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ చంద్ర‌య్య‌, మ‌త్స్య‌కారుల శాఖ అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, పార్టీ నాయ‌కులు, శాఖ‌ల సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.