బీఆర్‌ఎస్ నేతలపై భగ్గుమన్న బీజేపీ నేతలు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్‌ఎస్ నేతలపై భగ్గుమన్న బీజేపీ నేతలు
– మోడి దిష్టిబొమ్మను దహనం చేసిన వారిపై చర్యలకు డిమాండ్
– తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: : తాండూరు బీఆర్ఎస్ నేతలపై స్థానిక బీజేపీ నేతలు భగ్గుమన్నారు. భారత ప్రధానమంత్రి మోడి దిష్టి బొమ్మను దహనం చేయడం చట్ట విరుద్దమని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు దర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పీఎం నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ఖండించారు. దేశ ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసిన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టలు పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేసి కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, కార్యదర్శి ప్రకాష్, సంఘమేశ్వర్, బీజేవైఎం నాయకులు కిరణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.