బాగాయిపల్లిలో వెల్లివిరిసిన భక్తి పారవశ్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

బాగాయిపల్లిలో వెల్లివిరిసిన భక్తి పారవశ్యం
– వైభవంగా నవగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్టాపన

– హాజరైన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– దర్శించుకున్న బీఆర్ఎస్ నేతలు
యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం బాగాయిపల్లిలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శివాలయంలో నవగ్రహ, నాగులు, ధ్వజస్తంభ ప్రతిష్టాతపన ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. గురువారం ప్రారంభమైన ఉత్సవాలలో శుక్రవారం దేవాలయంలో నవగ్రహ, నాగుల విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిస్ఠాపన ఉత్సవాలు నిర్వహించారు.

ఈ ఉత్సవాలకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఎంపీటీసీ రాములు, పీఏసీఎస్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తదితరులు కూడ హాజరై పూజల్లో పాల్గొన్నారు. దేవాలయంలో వెలసిన స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరు దైవ చింతన కలిగి ఉండాలన్నారు. దేవాలయం అభివృద్ధికి తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.