శ్రీ చైతన్య పాఠశాలలకు షాక్..!

కెరీర్ తాండూరు వికారాబాద్

శ్రీ చైతన్య పాఠశాలలకు షాక్..!
– స్కూళ్ల కొనసాగింపుకు అనుమతులు రద్దు
– ఈ విద్యా సంవత్సరం వరకే నిర్వహణ
– స్పష్టం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాలకు విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది. వచ్చే యేడాది నుంచి స్కూళ్ల నిర్వహణకు అనుమతులు రద్దు చేసినట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సోమవారం ఓప్రకటనలో స్పష్టం చేశారు. వికారాబాద్‌ జిల్లాలోని ఎన్నెపల్లి, తాండూరులోని శాంతినగర్‌ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలలు నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్రాంచ్‌లకు అనుమతులు లేవనే ప్రచారం కూడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ రీజీనల్ జాయింట్ డైరెక్టర్ పాఠశాలల అనుమతులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం తరగతులు కొనసాగుతున్నందున ఈ యేడాది చివరి పని దినం వరకు కొనసాగించేందుకు అవకాశం ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం 2023-24లో పాఠశాలల కొనసాగింపుకు అనుమతులు నిరాకరించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మరోవైపు పాఠశాలల అనుమతులు నిరాకరణ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళకు గురువుతున్నారు.