సామన్యులకు గుడ్‌ న్యూస్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

సామన్యులకు గుడ్‌ న్యూస్..!
– కొత్త ప్లాట్‌ ఫామ్‌ను ప్రారంభిస్తోన్న కేంద్రం
– ఇక డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ ఆప్‌డేట్‌లు ఈజీ
– దర్శిని డెస్క్‌: దేశంలోని సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్తను అందించేందుకు సన్నద్దమైంది. అందరికి కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకవచ్చేందుకు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే కొత్త వ్యవస్థతో కీలకమైన డాక్యుమెంట్లలో వివరాల అప్‌డేట్ అనేది సులభతరం కానుంది. చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు వంటివి ఉంటాయి. ఇవి చాలా కీలకమైన డాక్యుమెంట్లు. అయితే మనం గమనిస్తే.. కొంత మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లో ఒక రకమైన అడ్రస్ ఉంటే.. రేషన్ కార్డులో మరో అడ్రస్ ఉంటుంది. ఇక ఓటర్ కార్డులో కూడా ఇలా వేర్వేరు వివరాలు ఉండొచ్చు. కేవలం అడ్రస్ మాత్రమే కాకుండా ఇతర వివరాలు కూడా ఒక్కో డాక్యుమెంట్‌లో ఒక్కోలా ఉండే ఛాన్స్ ఉంది. ఇలా ఈ డాక్యుమెంట్లు అన్నింటిలో వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కష్టమైన పనే. ఎందుకంటే వివరాలను మార్చుకోవడానికి ఒక్కో డాక్యుమెంట్ కోసం ఒక్కో ప్లేస్‌కు వెళ్లాల్సి రావొచ్చు. అందుకే చాలా మంది ఇలా కీలకమైన డాక్యుమెంట్లలో వివరాలను కూడా అప్‌డేట్ చేసుకోకపోవచ్చు. అయితే ఇకపై రానున్నా కాలంలో ఈ డాక్యుమెంట్లలో వివరాల అప్‌డేట్ అనేది చాలా సులభతరం కాబోతోంది. కేంద్రం కొత్త సర్వీసులతో ఇది చాలా ఈజీ కానుంది. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకువచ్చే పనిలో నిగమ్నమైందని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంటోంది. ఎకనమిక్ టైమ్స్ ప్రకారం.. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త సిస్టమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా మీరు ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకుంటే.. ఆ మార్పులు ఆటోమేటిక్‌గానే ఇతర డాక్యుమెంటలలో కూడా అప్‌డేట్ అవుతాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఆధార్ కార్డులో ఏమైనా వివరాలను అప్‌డేట్ చేస్తే.. అవి డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ కార్డులో కూడా అప్‌డేట్ అవుతాయి. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. సింపుల్‌గా అన్ని డాక్యుమెంట్లలో ఒకే విధమైన వివరాలు ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కొత్త సిస్టమ్ డెవలప్‌మెంట్ కోసం ట్రాన్స్‌పోర్ట్, రూరల్ డెవలప్‌మెంట్, పంచాయితీ రాజ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి వాటితో చర్చలు జరుపుతోంది. ఐటీ శాఖ తొలిగా డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి కీలకమైన డాక్యుమెంట్లను జారీ చేసే డిపార్ట్‌మెంట్లతో మాట్లాడనుంది. తర్వాత పాస్‌పోర్ట్ వంటి ఇతర డాక్యుమెంట్లకు ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావొచ్చు. కొత్త ప్లాట్‌ఫామ్ మీదకు ఒక పది మంత్రిత్వ శాఖలను తీసుకువస్తే.. అప్పుడు మీరు ఆధార్ కార్డులో వివరాలను మార్చుకునేటప్పుడు.. ఆటో అప్‌డేట్ ఫీచర్ ఓకే చేస్తే.. అలా మీరు మార్చిన వివరాలు ఇతర కీలక డాక్యుమెంట్లలో కూడా అప్‌డేట్ అవుతాయని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే కొత్త సర్వీసుల వల్ల చాలా మంది ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.