చదువుతో మహిళలకు గుర్తింపు

కెరీర్ తాండూరు వికారాబాద్

చదువుతో మహిళలకు గుర్తింపు
– సెల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి
– తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమత
– ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి: చదువుకుంటేనే మహిళలకు గుర్తింపు వస్తుందని తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమత అన్నారు. గురువారం తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీపో మేనేజర్ సమత, కళాశాల ప్రిన్సిపల్ ఎం.రవీందర్ లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీపో మేనేజర్ సమత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతిని సాధించాలన్నారు. అందుకు చదువు ఒక్కటే మార్గమని సూచించారు. చదువుకుంటే మహిళలకు గుర్తింపు వస్తుందని, ఎంచుకున్న రంగాల్లో రాణించవచ్చన్నారు. అదేవిధంగా విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని, లక్ష్యాలను సాధించుకునేందుకు కష్టపడాలని పేర్కొన్నారు. అనంతరం డీపో మేనేజర్, మహిళ అధ్యాపకులు, విద్యార్థులు మహిళ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.