ఎమ్మెల్యే జోలికొస్తే ఖబడ్దార్
– బ్రోకర్ రాజకీయాలు మానుకోండి
– కుక్కల్లాగ మొరిగితే నక్కల్లాగా వాతలు
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులను హెచ్చరించారు. గ్రామ కమిటిల ఎన్నికల విషయంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్, ఎల్మకన్నె పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, బషీరాబాద్ మండలం నావంద్గి పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డిలు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆయన వర్గీయులపై చేసిన విమర్శలను మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ఖండించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడే నాయకులకు పదవులు వచ్చాయని తెలిపారు. తనతో పాటు కోట్‌పల్లికి చెందిన ఉద్యమకారుడు పాండు కుటుంబంలో మార్కెట్ కమిటి పదవులు ఇప్పించారని గుర్తుచేశారు. 2013లోనే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నారని, ఆయనే పార్టీలో సీనీయర్ అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ వెంట స్వార్థం కోసం వాళ్లు టీఆర్ఎస్లో చేరారని అన్నారు. రవీందర్ గౌడ్, వెంకట్రామ్రెడ్డిలు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వద్ద బ్రోకర్లు పనిచేశారని అన్నారు. తాండూరుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాస్‌గా ఉంటారని అధిష్టానం చెప్పిందన్నారు. రవీందర్‌గౌడ్, వెంకట్రామ్రెడ్డిలకు తొందరపాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గాని.. రవీందర్‌గౌడ్ కాని.. వెంకట్రామ్రెడ్డి కాని బాసులు కారని పెదవి విరిచారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఏదోరకంగా వివాదాలు సృష్టిన్నారని అన్నారు. ఇష్టంలేకుంటే వెళ్లిపోవాలని కాని, ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికైనా బ్రోకర్ రాజకీయాలు మానుకోవాలన్నారు. కాదని కుక్కల్లాగా మొరిగితే నక్కల్లాగా వాతలు పెడతామని ఘాటుగా హెచ్చరించారు. అంతకుముందు ఎమ్మెల్యే జోలికి, కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, రైతు సమన్వయ సమితి కన్వినర్ రాంలింగారెడ్డి, మహిళ నాయకురాలు శకుంతల, మార్కెట్ కమిటి డైరెక్టర్ మల్లప్ప, సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు తదితరులు ఉన్నారు.
https://youtu.be/qsbArZa4Lds

