భద్రేశ్వరునికి గజమాల సమర్పణ
– కోటం కుటుంబ సభ్యులు ఆనవాయితీ
– 11 వ సారి అంకరణకు గజమాల
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వరుడు భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. స్వామిని దర్శించుకున్న భక్తుల మొక్కులు తీరుస్తూ మహిమలను చాటుతున్నాడు. ఇలా కోరిన కోర్కెలు తీర్చిన భద్రేశ్వరునికి భక్తులు వస్తు రూపేణా, ఆభరణా రూపేణా మొక్కులు తీర్చుకుంటున్నారు. గత 11 సంవత్సరాలుగా తాండూరుకు చెందిన కోటం వీరప్ప కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకునే సంప్రదాయ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రతియేటా భద్రేశ్వర జాతర ఉత్సవాలలో ఈ కుటుంబ సభ్యులు భద్రేశ్వరునికి స్వామి పల్లకిసేవ అలంకరణకు భారీ గజమాలను సమర్పిస్తున్నారు. ఈ ఏటా ప్రారంభమైన జాతర ఉత్సవాలలో కూడ కోటం వీరప్ప కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకున్నారు.
11వ సారి భద్రేశ్వరునికి భారీ గజమాలను సమర్పించారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు భద్రేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం గజమాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడ భద్రేశ్వురునికి నాగాభరణం, వెండి రుద్రాక్ష మాలను సమర్పించడం జరిగిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కోటం వీరప్ప కుటుంబ సభ్యులు, దేవాలయ పూజారి విజయ్ కుమార్ స్వామి, మల్లికార్జున స్వామి, ఆలయ రెనవేషన్ కమిటి చైర్మన్ బంటారం సుధాకర్, ఈఓ శేఖర్ గౌడ్, సభ్యులు సడ్గి భద్రణ్ణ, జొన్నల వినోద్ కుమార్, శెట్టి భాస్కర్, లింగదలి రవికుమార్, సందీప్, గంగా శ్రావణ్, ఘనాపూర్ శంకర్, భజన మండలి భక్తులు పాల్గొన్నారు.

